06/13/2026
Trending News
Homeసంపాదకీయం

సంపాదకీయం

ఒకప్పుడు తరాలు తమ తమ కాలపు భావజాలాలతో గుర్తింపును సంపాదించుకున్నాయి. ఒక తరం భావకవిత్వంలో జీవించింది. ఇంకో తరం విప్లవ సాహిత్యాన్ని శ్వాసించింది. మరొక తరం ప్రభుత్వ ఉద్యోగాల భద్రతలో జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఇంకొందరు తమ కలలకూ వాస్తవాలకూ మధ్య లంకె కుదరక, నిరాశతో కాలం గడిపారు. కానీ ఇప్పుడు కనిపిస్తున్న తరం పూర్తిగా భిన్నం.

ఒకప్పుడు భారతీయ మిడిల్ క్లాస్ విజయానికి నిర్వచనం..స్థిరమైన ఉద్యోగం, స్వంత ఇల్లు, పిల్లల విద్య, కొంత బంగారం, భవిష్యత్తు కోసం పొదుపు. ఇప్పుడు అదే విజయానికి కొత్త నిర్వచనం..ప్రీమియం ఫోన్, పెద్ద కారు, విదేశీ ట్రిప్, బ్రాండెడ్ జీవనశైలి, సోషల్ మీడియాలో “పర్ఫెక్ట్ లైఫ్” ప్రదర్శన. ఈ మార్పు కేవలం అభిరుచిలో వచ్చిన పరిణామం కాదు;

చిన్న వ్యాపారం నుంచి పెద్ద బ్రాండ్‌గా ఎదగడం అనేది ఒక్కసారిగా జరిగే పరిణామం కాదు. అది ఒక దీర్ఘకాలిక ప్రయాణం. ఈ ప్రయాణంలో అత్యంత కీలకమైన అంశం “కన్సిస్టెన్సీ” — అంటే ప్రతి రోజూ ఒకే స్థాయి నాణ్యత, ఒకే స్థాయి సేవ, ఒకే స్థాయి నమ్మకాన్ని కస్టమర్‌కు అందించడం. మార్కెట్‌లో పోటీ ఎంత పెరిగినా,

గతంలో వ్యాపారం అంటే స్థిరత్వం, నిర్దిష్ట విధానాలు, ఒకే తరహా కస్టమర్ ప్రవర్తనలతో సాగేది. కానీ నేటి మార్కెట్‌లో స్థిరత్వం అనేది ఒక మాయ మాత్రమే. టెక్నాలజీ, వినియోగదారుల అభిరుచులు, గ్లోబల్ పోటీ ..ఇవన్నీ ప్రతి రోజూ మారుతున్నాయి. ఈ మార్పులను అర్థం చేసుకుని, వాటిని స్వీకరించి, వ్యాపార మోడల్‌ను తగిన విధంగా మార్చుకునే సంస్థలే

భారత ద్రవ్య పరపతి విధానంలో తాజా నిర్ణయం..భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచడం సాధారణ పరిపాలనా చర్యగా చూడలేము. ఇది ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో జాగ్రత్తగా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన ఈ నిర్ణయం వెనుక ఉన్న సంక్లిష్ట ఆర్థిక సమీకరణాలను పరిశీలిస్తే, దాని

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి పడిపోవడం, తొలిసారి 95 మార్క్‌ను దాటడం..ఇది సాధారణ మార్కెట్ ఊగిసలాటగా తీసుకునే పరిణామం కాదు. ప్రస్తుతం ఒక డాలర్ విలువ రూ.95.12కు చేరడం భారత ఆర్థిక వ్యవస్థలోని అంతర్గత బలహీనతలను బయటపెడుతోంది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో కనిపిస్తున్న భారీ పతనం..సెన్సెక్స్ 1,750 పాయింట్లు