05/04/2024
Homeస్టార్టప్ స్టోరీస్స్టార్టప్ సక్సెస్ కావాలంటే!

స్టార్టప్ సక్సెస్ కావాలంటే!

స్టార్టప్ సక్సెస్ కావాలంటే!

ఉద్యోగంలో చేరేదాకా చాలామందికి జీవితం పట్ల స్పష్టతే ఉండదు. చదువైపోతుంది. క్యాoపస్ ఇంటర్వ్యూలో అవకాశం వస్తుంది. జీతమూ బావుంటుంది. మరో ఆలోచనే లేకుండా జాయినైపోతారు. ఆ తరువాత భ్రమలన్నీ తొలగిపోతాయి. ఆ గానుగెద్దు బ్రతుకు వృధా అనిపిస్తుంది. తమదంటూ ఓ .. వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలన్న ఆలోచన మొదలవుతుంది. బిజినెస్ ఐడియా, పెట్టుబడి డబ్బులూ .. సమకూర్చుకున్నాక కొందరు బయటకు వచ్చేస్తున్నారు. కంపెనీలు ప్రారంభిస్తున్నారు. దేశంలో కొత్తగా పుట్టుకొచ్చిన మిలియనీర్లలో ప్రతీ ఐదుగురిలో ఒకరు ముప్పై ఏళ్లలోపే సొంత వ్యాపారాన్ని ప్రారంభించినట్టు లెక్కల్లో తేలింది.
ప్రతీ ముగ్గురిలో ఒకరు నలభై ఏళ్ళు నిండే లోపు ‘ఎంటర్ ప్రెన్యూనర్’ అనిపించుకున్నారని తాజాగా ఒక నివేదిక స్పష్టం చేసింది! అయితే ఎన్నో ఆశలతో మొదలు పెట్టిన స్టార్ట్ అప్స్ లలో ఎక్కువ శాతం ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఒక సర్వే ప్రకారం 90 శాతం అంకుర పరిశ్రమలు మొదలుపెట్టిన మొదటి 3 సంవత్సరాలలోనే ఫెయిల్ అయ్యాయని తేలింది. ఈ రంగంలో గెలుపు ఓటములు అనేవి సహజం కానీ ఎవరు కూడా ఓటమి పొందాలనుకోరు. ముఖ్యంగా తెలివైనవాళ్ళు ఇతరుల తప్పుల నుండి నేర్చుకుంటారు. ఆ తప్పులు వాళ్ళు చెయ్యకుండా తప్పించుకుంటారు. అందుకోసం అసలు స్టార్టప్ లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి?

కారణాలు ఇవీ
————————–

స్టార్టప్ అంటేనే మార్కెట్ లో ఉన్న సమస్యను కనిపెట్టి దానికి సరైన పరిష్కారాన్ని అందించడం. కాని చాలా మంది ఒక ప్రదేశంలో లేదా ఆ సమయానికి అవసరం లేని ప్రొడక్ట్ ని లేదా సేవలను ప్రారంభించి చేతులు కాల్చుకుంటారు. అలాగే మన ప్రొడక్ట్ కన్నా ఇంకా మంచి ప్రొడక్ట్ లేదా సర్వీస్ మార్కెట్ లో ఉన్నప్పుడు మన స్టార్టప్ ఫెయిల్ అవుతుంది.

స్టార్టప్ మొదలు పెట్టేటప్పుడు ఒక అంచనా వేసుకుని కొంతపెట్టుబడితో రంగంలోకి దిగుతారు. ఒక్కొక్కసారి తమ పెట్టుబడి అంతా అయిపోతుంది. కంపెనీని ముందుకు నడపడానికి కావాల్సిన నిధులు లేక మధ్యలోనే చాలా స్టార్టప్ లు మూతపడుతుంటాయి. కాబట్టి స్టార్టప్ ని నడిపేవారు కష్ట కాలంలో గట్టెక్కడానికి గాని, లేదా వ్యాపారాన్ని మరింత విస్తరింపచెయ్యడానికి నిధుల కోసం ఇన్వెస్టర్ లను వెతుక్కుంటూ ఉండాలి.

ఒక స్టార్టప్ రన్ చెయ్యడంలో అతి ముఖ్యమైన మరియు కష్టమైన పని ఇదే. మన టీం లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. కాబట్టి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు బృందంలోని అందరి భావాలను అడిగితెలుకోవాలి. టీంలో ఒకరు ఎక్కువ పని చేస్తున్నారు, మరొకరు తక్కువ పనిచేస్తున్నారు అనే భావన కలిగితే బిజినెస్ ని ముందుకు తీసుకువెళ్లడం చాలా కష్టం. కాబట్టి టీంలో అందరి మధ్య మంచి అనుబంధం తప్పనిసరి. అలాగే ఉద్యోగుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నైపుణ్యం లేని వారిని ఎంచుకుంటే తరువాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కంపెనీ నిర్వహణలో ఉండే భాగస్వాములకు ఆ డొమైన్ పై పట్టు ఉండాలి. లేదా వేగంగా తెలుసుకునే ప్రయత్నం అయినా చేయాలి. లేకపోతే అసలుకు మోసం వస్తుంది.

మార్కెటింగ్ లేకపోవడం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

మనం ఎంత గొప్ప ప్రొడక్ట్ లేదా సర్వీస్ ని ప్రారంభించినా దాని గురించి ఎవరికీ తెలియకపోతే అది కనుమరుగైపోతుంది. మనదంటూ ఒక ప్రొడక్ట్ ఉందని ప్రపంచానికి తెలిసేది మార్కెటింగ్ ద్వారానే. అందుకే పేరు ప్రఖ్యాతులు గడించిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా మార్కెటింగ్ కోసం కోట్లు ఖర్చుచేస్తూ ఉంటాయి. మార్కెటింగ్ వల్ల మన బ్రాండ్ విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి ఒక స్టార్టప్ కి మార్కెటింగ్ అనేది తప్పనిసరి.

మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మన కస్టమర్ అవసరాలను తీర్చడం, అలాగే తిరిగి వారి నుండి అభిప్రాయాలను స్వీకరించడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ద్వారా మనం ఎక్కడ వెనకబడి ఉన్నాం, ఏ విభాగంలో మనల్ని మనం సరిదిద్దుకోగలమో తెలుస్తుంది. ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనం మారాలి. అలాగే కస్టమర్స్ దగ్గర నుండి మనం ఫీడ్ బ్యాక్ తీసుకోవడం వలన మనం వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇస్తున్నామని వాళ్లకు అర్ధమవుతుంది. దానివల్ల వాళ్ళకి మన పై నమ్మకం పెరుగుతుంది.

కొంతమంది తెలిసో తెలియకో కొన్ని చట్టపరమైన తప్పులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి అప్పటికే ఉన్నటువంటి పేరు మీదే మళ్ళీ స్టార్టప్ ని మొదలుపెట్టడం, లేదా ఇతరుల లోగోలు వాడడం, ప్రభుత్వం నుండి కావలసిన పర్మిషన్ లు, లైసెన్స్ లు తీసుకోకపోవడం మొదలైనవి. కాబట్టి ముందుగానే అన్నీ చెక్ చేసుకుని మొదలుపెట్టడం మంచిది. లేకపోతే తరువాత వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యల వలన మూతపడిన కంపెనీలు కూడా చాలా ఉన్నాయి.

చేస్తున్న పనిమీద అభిరుచి లేకుండా కేవలం డబ్బు కోసం స్టార్టప్ పెట్టడం, బిజినెస్ మోడల్ లేకపోవడం, పరిస్థితులకు తగ్గట్టుగా మారకపోవడం, ఇన్నోవేటివ్ గా ఆలోచించకపోవడం ఇవన్నీ కూడా స్టార్టప్ లు విఫలమవడానికి కారణాలు.

వ్యాపారవేత్తగా ఎదగాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ, ఓ బలమైన స్థాయికి చేరుకునేది మాత్రం అతికొద్దిమందే. నిపుణుల సలహాలు తీసుకుంటే సక్సెస్ సమస్య కాదు.

Share With:
Rate This Article
No Comments

Leave A Comment