తెలంగాణా రాష్ట్రంలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో సామంత రాజులుగా చెలామణి అవుతున్నారు. రాబందుల్లా తయారయ్యారు. అపరిమితమైన అధికార బలంతో డబ్బు సంపాదనే ధ్యేయంగా వందల కోట్లకు ఎదిగిపోతున్నారు. అనేక ఉద్యమాల తరువాత రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అప్పుడే ప్రకటించారు. ఇకనుంచి
రెండేళ్లుగా కరోనా వైరస్ తో దేశమంతా డీలాపడ్డ ప్రస్తుత పరిస్థితుల్లో వరుసపెట్టి కార్పొరేట్ కంపెనీల బకాయిల రద్దు అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఉపాధిలేక, వచ్చే ఆదాయ వనరులు లేక ప్రభుత్వ నిబంధనల మేరకు తప్పని స్థితిలో ఇంట్లోనే ఉంటూ బక్కచిక్కిపోతున్న సామాన్యుడు రిజర్వ్ బ్యాంకు ప్రతియేటా తీసుకుంటున్న నిర్ణయాలపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.