వ్యాపారవేత్తగా ఎదగాలన్న కోరిక మనలో చాలామందికి ఉంటుంది. కానీ, ఓ బలమైన స్థాయికి చేరుకునేది మాత్రం అతికొద్దిమందే. మిగిలినవాళ్లంతా ఏదో ఓ దశలో స్వప్న సన్యాసం చేస్తారు. లేదంటే దారి మళ్లుతారు. తీరు మార్చుకుంటారు.
వ్యాపారంలో తొలి అడుగు ఐడియా.
మనదైన ఆలోచనను బలంగా నమ్మాలి.
ఆ చిన్న ఐడియాకు ప్రపంచాన్ని
మలుపుతిప్పే మహత్యం ఉందని విశ్వశించాలి.
మార్కెట్ ను పరిశోధించాలి.
వినియోగదారుడి మనస్తత్వాన్ని విశ్లేషించాలీ.
బిజినెస్ ప్లాన్ తయారుచేయాలి.
నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలి.
ఆలోచనల్ని ఆచరణలో పెట్టాలి.
నిధులు సేకరించాలి.
వ్యాపారాన్ని ప్రారంభించాలి.
సరికొత్త వ్యూహాలతో నిలదొక్కుకోవాలి.
ఇవన్నీ దాటేసి చివరగా ..
విజయంవైపు అడుగులేయ్యాలి.
“వ్యాపార విజయాన్ని ఒడిసి పట్టుకోవాలంటే దీర్ఘకాలిక ద్రుష్టి ఉండాల్సిందే. సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిందే”
